Naga Chaitanya: సమంత కనిపిస్తే వాటేసుకుంటా.. చైతన్య ఆసక్తికర వ్యాఖ్యలు
I will give Samantha a hug Says Naga Chaitanya: సమంత కలిస్తే హగ్ చేసుకుంటా అంటూ నాగచైతన్య ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
I will give Samantha a hug Says Naga Chaitanya: సమంత నాగచైతన్య ప్రేమించి పెళ్లాడి తర్వాత విడాకులు కూడా తీసుకున్న సంగతి తెలిసిందే. గత ఏడాది అక్టోబర్ నెలలో వీరు విడాకులు తీసుకుంటున్నామని అధికారికంగా ప్రకటించారు. ఆ ప్రకటన వచ్చి దాదాపు పది నెలలు గడుస్తున్నా వీరిద్దరి గురించి ఎలాంటి వార్తా వచ్చినా అది వెంటనే సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంటుంది. ఈ మధ్యనే కాఫీ విత్ కరణ్ షోలో పాల్గొన్న సమంత మీ ఇద్దరి మధ్య ఇప్పుడు పరిస్థితి ఎలా ఉంది అని అడిగితే మా ఇద్దరినీ కలిపి ఒక గదిలో పెడితే అక్కడ పదునైన వస్తువులు లేకుండా దాచేయాలని లేకపోతే వాటితో పొడుచుకుంటామేమో అని అర్థం వచ్చేలా కామెంట్ చేసింది.
ఇక తాజాగా లాల్ సింగ్ చద్దా సినిమాలో ఒక కీలక పాత్రలో నటించి బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన నాగచైతన్య ఆ సినిమా ప్రమోషన్స్ లో బిజీగా ఉన్నాడు. ఆ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఇలాంటి ప్రశ్ననే ఆయనను కూడా అడిగారు విలేకరులు. ఒకవేళ సమంతను కలిస్తే మీరేం చేస్తారు అని అడిగితే నేను హాయ్ చెప్పి ఒక హగ్ ఇస్తానని నాగచైతన్య చెప్పుకొచ్చారు. ఇక ప్రశ్న దాదాపు ఒకటే అయినా ఇద్దరి స్పందనలు లు చాలా భిన్నంగా ఉండడంతో అక్కినేని అభిమానులు మా చైతన్య బంగారం అంటూ కామెంట్ చేస్తున్నారు.
సమంత చాలా దుర్మార్గంగా మాట్లాడితే నాగచైతన్య మాత్రం చాలా గొప్పగా ఆలోచించాడని వారు కామెంట్ చేస్తున్నారు. ఇక గతంలో సమంత గురించి నాగచైతన్య మాట్లాడుతూ మా పర్సనల్ లైఫ్ గురించి చెప్పాల్సింది ఇక అంతే. ఏవైతే విషయాలు నేను మీ ముందు చెప్పాలనుకున్నానో అవి చెప్పేసాను.
అది మంచో చెడో నేను చెప్పాలనుకున్నది ప్రేక్షకులకు అర్థమయ్యేలా చెప్పాను. ఇప్పుడు ఆమె పని ఆమె నా పని నేను చేసుకుంటున్నాము. ఇంకా మా గురించి మళ్లీ మళ్లీ అడిగి తెలుసుకోవాల్సిన అంత ముఖ్యమైన విషయాలు ఏమీ లేవని ఆయన వెల్లడించారు. ఇక మా జీవితాలలో ఏం జరిగిందనేది మా సన్నిహితులకు శ్రేయోభిలాషులకు తెలుసు ఈ విషయాల మీద మేము స్పందిస్తే ఆ వార్తలు అంతకంతకు పెరుగుతూనే ఉంటాయి తప్ప దాని వల్ల ఉపయోగం లేదు అని నాగచైతన్య చెప్పుకొచ్చారు.
Also Read: Laal Singh Chaddha: మొదటి రోజు దారుణంగా వసూళ్లు.. ఆ జాబితాలో దక్కని చోటు!
Also Read: Pavan Tej Konidela: హీరోయిన్ తో ఏడడుగులు వేయనున్న మెగా హీరో .. ఎంగేజ్మెంట్ ఫోటోలు చూశారా?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.